కువైత్: కొవిడ్-19 మహమ్మారి బారినపడి కువైత్‌లో భారతీయుడు మరణించాడు. కేరళకు చెందిన అబ్దుల్ కరీమ్(63) కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అబ్దుల్ కరీంను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. కొచ్చిన్ గ్రూప్ ఇంటర్నేషనల్‌కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అబ్దుల్ కరీం వ్యవహరిస్తున్నారు. ఈయనకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. కువైత్‌లో మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. రోజువారీ కేసుల సంఖ్య నిన్న గణనీయంగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 1409 మంది కొవిడ్ బారినపడగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో నమోదైన కేసుల సంఖ్య 1,94,781కి చేరింది. కరోనా కాటుకు 1,097 మంది బలయ్యారు.