Kerala: తాలిబన్లకు వ్యతిరేకంగా ఎఫ్‌బీ పోస్ట్..చంపేస్తామంటూ బెదిరింపు

ABN , First Publish Date - 2021-08-27T17:54:45+05:30 IST

కేరళ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్ ను చంపేస్తామంటూ ఆగంతకులు బెదిరింపు లేఖ రాశారు....

Kerala: తాలిబన్లకు వ్యతిరేకంగా ఎఫ్‌బీ పోస్ట్..చంపేస్తామంటూ బెదిరింపు

తిరువనంతపురం (కేరళ): కేరళ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్ ను చంపేస్తామంటూ ఆగంతకులు బెదిరింపు లేఖ రాశారు.తాలిబన్లకు వ్యతిరేకంగా పెట్టిన ఫేస్ బుక్ పోస్టును 24 గంటల్లో తొలగించాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తూ ఆగంతకుడు లేఖ రాశారు. ‘‘తాలిబన్లు మానవ హక్కులను గౌరవించని తీవ్రవాదం, వివక్ష, తిరోగమన రాజకీయ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. కులం, మతం, సిద్ధాంతాల పేరిట ముందుకు సాగుతున్న  స్త్రీ వ్యతిరేక రాజకీయాలన్నీ ప్రమాదకరమైనవి... ప్రజల స్వేచ్ఛా జీవితానికి ఆటంకం కలిగిస్తాయి. తాలిబన్లను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.’’ అని మునీర్ తన  ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే, తాలిబన్లకు వ్యతిరేకంగా తన వైఖరికి కట్టుబడి ఉంటానని మునీర్ చెప్పారు. బెదిరింపు లేఖపై తాను కేరళ సీఎం, డీజీపీలకు ఫిర్యాదు చేశానని మునీర్ వివరించారు.


Updated Date - 2021-08-27T17:54:45+05:30 IST