చెలరేగిపోతున్న ఒమైక్రాన్..కేరళలో 45, ఒడిశాలో 23 కేసులు వెలుగులోకి

ABN , First Publish Date - 2022-01-03T01:37:52+05:30 IST

దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ చెలరేగిపోతోంది. నిన్నమొన్నటి వరకు ఒకటి, అరా కేసులు వెలుగులోకి రాగా,

చెలరేగిపోతున్న ఒమైక్రాన్..కేరళలో 45, ఒడిశాలో 23 కేసులు వెలుగులోకి

తిరువనంతపురం: దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ చెలరేగిపోతోంది. నిన్నమొన్నటి వరకు ఒకటి, అరా కేసులు వెలుగులోకి రాగా, గత రెండు మూడు రోజులుగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు (ఆదివారం) కేరళలో 45 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 152కు పెరిగింది. ఒడిశాలోనూ నేడు ఏకంగా 23 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన ఒమైక్రాన్ కేసుల సంఖ్య 37కు చేరుకుంది.


ఒమైక్రాన్ ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించింది. రేపటి (జనవరి 3) నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులనుమూసివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, అత్యవసర సేవలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది.  

Updated Date - 2022-01-03T01:37:52+05:30 IST