Shocking: కేరళ నుంచి లండన్‌కు సైకిల్ టూర్.. కేరళ ఐటీ ఉద్యోగి సాహస యాత్ర!

ABN , First Publish Date - 2022-08-18T00:30:01+05:30 IST

ఒక ఖండం నుంచి మరొక ఖండానికి సైకిల్‌పై ప్రయాణించడం అనే ఆలోచన చాలా క్రేజీగా అనిపిస్తుంది.

Shocking: కేరళ నుంచి లండన్‌కు సైకిల్ టూర్.. కేరళ ఐటీ ఉద్యోగి సాహస యాత్ర!

ఒక ఖండం నుంచి మరొక ఖండానికి సైకిల్‌పై ప్రయాణించడం అనే ఆలోచన చాలా క్రేజీగా అనిపిస్తుంది. అయితే కొందరికి మాత్రం అలా ఉండదు. సైకిల్‌పై సుదీర్ఘ ప్రయాణాలు (Cycle tour) చేసేందుకు చాలా కొద్ది మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారిలో కేరళకు చెందిన ఐటీ ఉద్యోగి ఫైజ్ అష్రఫ్ అలీ ఒకరు. ఆయన కేరళ (Kerala)రాజధాని తిరువనంతపురం నుంచి లండన్‌ (London)కు సైకిల్‌పై బయల్దేరారు. సోమవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభమైంది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు.


ఇది కూడా చదవండి..

Little boy singing Jana Gana Mana: ఆ కుర్రాడు జనగణమణ పాడుతున్న తీరుకు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్


35 దేశాలలో మొత్తం 30,000 కి.మీ.లు ప్రయాణించి 450 రోజుల్లో లండన్ చేరుకోవాలని అలీ భావిస్తున్నారు. ఆసియా దేశాలతో పాటు రొమేనియా, ఉక్రెయిన్, ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన యూరోపియన్ దేశాలలో కూడా అలీ యాత్ర సాగనుంది. అయితే పాకిస్తాన్, చైనా దేశాల వీసాలు రాకపోవడం వల్ల ఆయా దేశాలకు అలీ వెళ్లరు. గతంలో అలీ ఐటీ ఉద్యోగిగా పనిచేశారు. అయితే సైకిల్ తొక్కడం, ప్రయాణాలు చేయడం అలీకి చాలా ఇష్టం.


విప్రోలో ఐటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి 2019లో అలీ మొదటి సారి సైకిల్ యాత్రకు వెళ్లారు. తన స్వస్థలమైన కోజికోడ్‌ నుంచి సింగపూర్‌కు వెళ్లారు. తాజాగా తిరువనంతపురంలో యాత్ర ప్రారంభించిన అలీ ముంబై వరకు సైకిల్‌పై వెళ్తారు. అక్కడి నుంచి విమానంలో ఒమన్ వరకు వెళ్తారు. అక్కడి నుంచి యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్,  టర్కీ మొదలైన దేశాల్లో సైకిల్ టూర్ చేసి యూరప్‌లోకి ప్రవేశిస్తారు. తన టూర్ ద్వారా శాంతి, ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయాలని అలీ భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-18T00:30:01+05:30 IST