కేరళ కోర్టు సంచలన తీర్పు.. 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అత్యాచార బాధితురాలికి అనుమతి

ABN , First Publish Date - 2022-07-17T02:25:42+05:30 IST

అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అాబర్షన్ విషయంలో కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది

కేరళ కోర్టు సంచలన తీర్పు.. 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అత్యాచార బాధితురాలికి అనుమతి

కొచ్చి:  అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అాబర్షన్ విషయంలో కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అబార్షన్ చేయించుకోవడం ద్వారా 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. అంతేకాదు, ఆమెకు అబార్షన్ చేసేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 15 ఏళ్ల బాధిత బాలిక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ వీజీ అరుణ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. అంతేకాదు.. ‘పుట్టినప్పుడు శిశువు సజీవంగా ఉంటే’ ఆ శిశువుకు ఉత్తమ వైద్యం అందించే బాధ్యతను కూడా ఆసుపత్రి చూస్తుందని పేర్కొన్నారు. 


పుట్టిన తర్వాత శిశువు బాధ్యతను తీసుకునేందుకు బాలిక అంగీకరించకపోతే ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుందని, వైద్య సాయంతోపాటు శిశువుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. బాలిక బాధను అర్థం చేసుకున్న తర్వాత ఆమెకు అనుకూలంగా మొగ్గు చూపడం సముచితమని తాను భావిస్తున్నట్టు జస్టిస్ వీజీ అరుణ్ ఆ తీర్పులో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-17T02:25:42+05:30 IST