దౌత్య మార్గంలో అక్రమంగా బంగారం త‌ర‌లింపు.. 10నెలల్లో 150కిలోలు

ABN , First Publish Date - 2020-07-15T13:38:13+05:30 IST

కేరళ గోల్డ్‌ స్కాం కేసులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దౌత్య మార్గంలో అక్రమంగా బంగారాన్ని తరలించిన ముఠా గత 10నెలల్లో 150కిలోలు తీసుకొచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో గుర్తించారు.

దౌత్య మార్గంలో అక్రమంగా బంగారం త‌ర‌లింపు.. 10నెలల్లో 150కిలోలు

కేరళ గోల్డ్‌ స్కాంలో తరలించిన బంగారమిది: ఎన్‌ఐఏ

కోచి, జూలై 14: కేరళ గోల్డ్‌ స్కాం కేసులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దౌత్య మార్గంలో అక్రమంగా బంగారాన్ని తరలించిన ముఠా గత 10నెలల్లో 150కిలోలు తీసుకొచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో గుర్తించారు. ఈ కేసులో అనుమానితులైన స్వప్న సురేశ్‌, సందీప్‌ నాయర్‌లను ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 21 వరకు రిమాండ్‌ విధించింది. బంగారం అక్రమ రవాణా కోసం నిందితులు యూఏఈ కాన్సులేట్‌ రాజముద్రను కూడా ఫోర్జరీ చేశారని తెలియజేశారు.


‘‘ఈ ముఠా 2019 సెప్టెంబరు నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వివిధ సంస్థల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అనుమానితులను ప్రశ్నించడం ద్వారా మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి. అక్రమ రవాణాలో ఎవరెవరి ప్రమేయం ఉందో కూడా తెలుస్తుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి. అక్రమంగా తరలించిన బంగారం ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికేనని కేంద్ర హోం శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-07-15T13:38:13+05:30 IST