కేరళలో ఆశ్చర్యకర ఫలితాలు.. బీజేపీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉందంటే..

ABN , First Publish Date - 2021-05-02T15:11:17+05:30 IST

కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మరోసారి పినరయి విజయ్ సీఎం అవుతారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి

కేరళలో ఆశ్చర్యకర ఫలితాలు.. బీజేపీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉందంటే..

కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మరోసారి పినరయి విజయ్ సీఎం అవుతారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆదివారం జరుగుతున్న ఎన్నికల ఫలితాలు కూడా అవే ట్రెండ్స్ ను చూపిస్తున్నాయి. దాదాపుగా ఎల్‌డీఎఫ్ లీడింగ్ సీట్లలో మెజార్టీ మార్కును దాటింది కూడా. ఉదయం 9.30గంటలకు అందిన సమాచారం ప్రకారం అధికార ఎల్‌డీఎఫ్ 80 సీట్లలో ఆధిక్యంలో ఉంది. యూడీఎఫ్ 55 సీట్ల ఆధిక్యాన్ని కనపరుస్తోంది. ఇక బీజేపీ కూటమి మాత్రం కేవలం రెండంటే రెండు సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు మూడు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. వాస్తవానికి బీజేపీ కూటమికి 5 వరకు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ, ప్రస్తుతానికి కేవలం రెండు స్థానాల్లోనే ఆధిక్యాన్ని కనపరుస్తోంది. 

Updated Date - 2021-05-02T15:11:17+05:30 IST