Abn logo
Sep 21 2021 @ 06:15AM

కేరళలో 90 శాతానికి పైగా జనాభాకు పూర్తయిన తొలిడోసు టీకా!

తిరువనంతపురం: కేరళలో 90శాతానికిపైగా జనాభాకు తొలిడోసు కరోనా టీకా ఇచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ కరోనా మృతులలో అధికశాతం మంది టీకాలు తీసుకోనివారే ఉన్నారని, అందుకే ప్రజలంతా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలోని ఐదుకుపైగా జిల్లాల్లో 100 శాతం మేరకు తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, మిగిలిన జిల్లాలలోనూ అధికశాతం జనాభాకు టీకాలు వేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతున్నదని, అందుకే కేసులు అధికంగా ఉన్నప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption