ఏరా.. పోరా.. అనే పదాలు వాడొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశాలు..!

ABN , First Publish Date - 2021-09-11T19:28:09+05:30 IST

ప్రజలతో పోలీసులు సవ్యమైన భాషలోనే మాట్లాడాలని, వారితో అగౌరవంగా మాట్లాడకూడదని కేరళ డీజీపీ అనిల్ కాంత్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

ఏరా.. పోరా.. అనే పదాలు వాడొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశాలు..!

ప్రజలతో పోలీసులు సవ్యమైన భాషలోనే మాట్లాడాలని, వారితో అగౌరవంగా మాట్లాడకూడదని కేరళ డీజీపీ అనిల్ కాంత్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తమ దగ్గరకు వచ్చిన వారి వద్ద `ఎడా`(ఏరా), `ఎడి`(ఏమే) వంటి అగౌరవ పదాలను ఉపయోగించవద్దని సూచించారు. పోలీసులు ప్రవర్తనను అనుక్షణం గమనించేందుకు ప్రతి జిల్లాలోని ఓ స్పెషల్ బ్రాంచ్ పనిచేస్తుందని తెలిపారు. ప్రజలతో అగౌరవంగా మాట్లాడిన పోలీసులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేరళ హై కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. 


వాహనాల తనిఖీ సందర్భంగా తన 15 ఏళ్ల కూతురితో పోలీసులు అసభ్యకరంగా మాట్లాడారని ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రజలతో సంభాషించేటపుడు పోలీసులు గౌరవంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. `ప్రజలతో మాట్లాడేటపుడు గౌరవంగా వ్యవహరించడం పోలీసులు నేర్చుకోవాలి. `ఎడా`, `ఎడి` వంటి పదాలతో ప్రజలను పిలిచే హక్కు పోలీసులకు లేదు. ప్రజలతో గౌరవంగా మాట్లాడాలని పోలీసులకు సూచిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేయాల`ని కేరళ హైకోర్టు సూచించింది. 



Updated Date - 2021-09-11T19:28:09+05:30 IST