తిరువనంతపురం: కేరళ భరతనాట్యం కళాకారిణి మాన్సియా మతం కారణంగా ఆలయంలో ప్రదర్శన ఇవ్వకుండా నిషేధించారు.కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లోని ఒక ఆలయంలో భరతనాట్యం నృత్య కళాకారిణి మాన్సియా ప్రదర్శనను నిషేధించింది. ప్రభుత్వ దేవస్థానం బోర్డు పరిధిలోకి వచ్చే కూడల్మాణిక్యం దేవాలయం ప్రాంగణంలో హిందూయేతరులు నాట్య ప్రదర్శనలు నిర్వహించరాదని ఆలయ కమిటీ ప్రకటించింది.భరతనాట్యంలో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ అయిన మాన్సియా ముస్లింగా పెరిగింది. ఆమె శాస్త్రీయ నృత్య రూపాల ప్రదర్శన కళాకారిణిగా ఇస్లామిక్ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంది.
‘‘మతం ఆధారంగా నా నాట్యప్రదర్శనను బహిష్కరించడం నాకు మొదటి అనుభవం కాదు. కొన్నేళ్ల క్రితం గురువాయూర్ ఆలయంలో ఇలాంటిదే జరిగింది. కళ, కళాకారులు మతం, కుల నిబంధనలతో నడుస్తూ ఉన్నాయి. కళ ఒక మతానికి గుత్తాధిపత్యం అవుతుంది. దానిని నిషేధిస్తోంది. మన లౌకిక రాజ్యమైన కేరళ రాష్ట్రంలో ఏదీ మారలేదని రిమైండర్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను’’ అని మాన్సియా పేర్కొన్నారు.ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే పూజలు నిర్వహించుకోవచ్చని కూడల్మాణిక్యం దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రదీప్ మీనన్ చెప్పారు.
‘‘ఆలయంలో 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం దాదాపు 800 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. కళాకారులు హిందూ సమాజానికి చెందినవారా లేదా అని అడగాలి. తనకు మతం లేదని మాన్సియా లిఖితపూర్వకంగా చెప్పింది. అందుకే ఆమె ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాం’’ అని ఆలయ నిర్వాహకులు చెప్పారు.
ఇవి కూడా చదవండి