సెక్స్ వర్కర్లకు తక్షణం రేషన్‌ కార్డుల జారీ

ABN , First Publish Date - 2021-12-18T13:46:02+05:30 IST

సుప్రీంకోర్టు ఆదేశంతో కేరళ రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు తక్షణం రేషన్ కార్డులు జారీ చేయాలని కేరళ సర్కారు కోరింది....

సెక్స్ వర్కర్లకు తక్షణం రేషన్‌ కార్డుల జారీ

తిరువనంతపురం:సుప్రీంకోర్టు ఆదేశంతో కేరళ రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు తక్షణం రేషన్ కార్డులు జారీ చేయాలని కేరళ సర్కారు కోరింది. సెక్స్ వర్కర్లందరికీ ప్రాధాన్యమిచ్చి రేషన్ కార్డులు జారీ చేస్తామని కేరళ అధికారులు చెప్పారు. కేరళలో సెక్స్ వర్కర్లు రాష్ట్రంలోని ఏ రేషన్ దుకాణం నుంచి అయినా రేషన్ తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.కేరళ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ యొక్క డేటా ప్రకారం రాష్ట్రంలో 18,000 మంది సెక్స్ వర్కర్లు వివిధ ప్రాజెక్టులలో పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో కొందరికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తమ జీవిత భాగస్వాముల నుంచి విడిపోయారు.ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం 228 మంది సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు లేవు. వారికి ప్రభుత్వం కార్డులు మంజూరు చేస్తుందని అధికారులు తెలిపారు. 


పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.కొవిడ్ మహమ్మారి కారణంగా సెక్స్ వర్కర్ల ఆదాయంలో భారీ కోత పడిందని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.సెక్స్ వర్కర్లకు ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం  ఆదేశించింది. చేసే వృత్తితో సంబంధం లేకుండా ప్రతి పౌరునికీ ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని తెలిపింది.

Updated Date - 2021-12-18T13:46:02+05:30 IST