Abn logo
Jan 15 2021 @ 20:58PM

`కెనడి క్లబ్` ఫస్ట్ లుక్ విడుదల!

శశి కుమార్, భారతీ రాజా, మీనాక్షి గోవిందరాజన్, సూరి ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం `కెనడి క్లబ్`. సుశీంద్రన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత  డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. 


ఈ సందర్భంగా నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. `సుశీంద్రన్ దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం తమిళం లో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా నచ్చుతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేస్తామ`ని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement