పంజాబ్‌ హామీనే గోవాలోనూ చేసిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-05T21:46:49+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గృహ ఆధార్ ఆదాయాన్ని నెలకు 1,500 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచుతాం. అలాగే ప్రతి మహిళకు నెలకు 1,000 రూపాయలు అందిస్తాం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమం..

పంజాబ్‌ హామీనే గోవాలోనూ చేసిన కేజ్రీవాల్

పనాజీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీనే గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించిన కెజ్రీవాల్.. గోవాలో ఆప్ అధికారంలోకి వచ్చినా 18 ఏళ్లు నిండిన అక్కడి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం గోవాలోని నవేలింలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.


‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గృహ ఆధార్ ఆదాయాన్ని నెలకు 1,500 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచుతాం. అలాగే ప్రతి మహిళకు నెలకు 1,000 రూపాయలు అందిస్తాం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమం’’ అని కేజ్రీవాల్ అన్నారు. గోవా అసెంబ్లీకి 2022 ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2021-12-05T21:46:49+05:30 IST