నిరాశ్రయులకు ఆహార సరఫరాను ప్రారంభించిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-08-08T18:29:03+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిరాశ్రయులకు రాష్ట్ర ప్రభుత్వం

నిరాశ్రయులకు ఆహార సరఫరాను ప్రారంభించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిరాశ్రయులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇల్లు లేని నిరుపేదల కోసం నడుపుతున్న నైట్ షెల్టర్లలో తలదాచుకునేవారి కోసం ఆహార సరఫరా పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. 


ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీ ప్రభుత్వం 209 నైట్ షెల్టర్లను నిర్వహిస్తోందని తెలిపింది.  వీటిలో సుమారు 12 వేల మంది తలదాచుకుంటున్నారని పేర్కొంది. వీరికి వసతి సదుపాయాన్ని కల్పించడంతోపాటు ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ నైట్ షెల్టర్లలో ఉండేవారికి వండిన ఆహారాన్ని అక్షయ పాత్ర సరఫరా చేస్తుందని వివరించింది. 


Updated Date - 2021-08-08T18:29:03+05:30 IST