Abn logo
May 9 2020 @ 11:15AM

కీర్తి చూపు బాలీవుడ్ వైపు?

తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేసిన యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ `మహానటి`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ అవార్డునందుకుంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. తొలి సినిమాలోనే అజయ్ దేవగణ్ సరసన `మైదాన్‌`లో నటించే అవకాశం కీర్తికి వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి కీర్తి తప్పుకుంది. 


అజయ్ భార్య పాత్రలో, మధ్య వయసు మహిళగా నటించమని అడగడంతో ఆ సినిమా నుంచి కీర్తి తప్పుకుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. తొలి సినిమాలోనే పెద్ద వయసు గల మహిళ పాత్రలో నటిస్తే ఇకపై వరుసగా అలాంటి అవకాశాలే వస్తాయని కీర్తి భయపడిందట. `మైదాన్‌` నుంచి తప్పుకున్నప్పటికీ కీర్తికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. లాక్‌డౌన్ తర్వాత కీర్తి బాలీవుడ్ సినిమాల గురించి ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement