Abn logo
May 8 2021 @ 23:59PM

14వరకు కీసరగుట్ట ఆలయం మూసివేత

కీసరగుట్ట ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయం ఎదుట సూచిక బోర్డు(బ్యానర్‌) ఏర్పాటుచేసిన ఆలయ నిర్వాహకులు

కీసర : కరోనా ఉగ్రరూపం దాల్చుతుండటంతో కీసరగుట్ట ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. ఈ మేరకు నేటి నుంచి ఈనెల 14వరకు స్వామివారి దర్శనం, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నామని ఆలయ చైర్మన్‌ తటాకం నాగలింగం శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డిలు శనివారం తెలిపారు. అదేవిధంగా స్వామివారికి రోజువారీగా అర్చకులు నిత్యసేవలు చేస్తారని తెలిపారు. భక్తులు కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.