Abn logo
Jan 15 2021 @ 20:39PM

మహానటి స్లిమ్ లుక్!

`మహానటి` సినిమాతో ఎంతో గుర్తింపును, జాతీయ అవార్డును సాధించింది హీరోయిన్ కీర్తీ సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటివరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల పైనే ఎక్కువ దృష్టి సారించిన కీర్తి.. ఇటీవల గేర్ మార్చింది. వరుసగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తోంది. 


స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటోంది. అందుకోసం తన రూపాన్ని కూడా మార్చుకుంది. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి తాజాగా స్లిమ్‌గా మారిపోయింది. స్లిమ్ లుక్‌లో ఉన్న తన ఫొటోలను కీర్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో కీర్తి చాలా సన్నగా ఉంది. కీర్తి ప్రస్తుతం తెలుగులో `రంగ్ దే`, `సర్కారు వారి పాట` సినిమాలు చేస్తోంది. అలాగే పవన్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement