Abn logo
May 22 2020 @ 13:11PM

ఇన్‌స్టాలో కీర్తిసురేశ్ మార్క్‌

ఒక ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టిస్తూ హీరో్యిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకోవ‌డ‌మే కాదు జాతీయ అవార్డుని కూడా ద‌క్కించుకుంది హీరోయిన్ కీర్తి సురేశ్‌. రీసెంట్‌గా ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 5 మిలియ‌న్స్‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా కీర్తిసురేశ్ త‌న ఫాలోవ‌ర్స్‌కు థాంక్స్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో కీర్తి సురేశ్ కుక్క‌తో క‌లిసి క‌నిపించారు. వీడియో పాటు మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాల‌కు నేను, నైక్ సంతోషిస్తున్నాం అని మెసేజ్ కూడా పోస్ట్ చేశారు కీర్తి సురేశ్‌. ఈ వీడియోలో కీర్తి సురేశ్ మేక‌ప్ లేకుండా కనిపించ‌డం విశేషం. 


Advertisement
Advertisement
Advertisement