Abn logo
Feb 25 2020 @ 13:45PM

బాలయ్యకు `నో` చెప్పిన కీర్తి?

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటర్నత నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మొదట్నుంచి హీరోయిన్ సమస్య వెంటాడుతూనే ఉంది. తొలుత కేథరిన్ ట్రెసాను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. అయితే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే కారణంతో ఆమెను తప్పించారని టాక్.  


ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఒక హీరోయిన్‌గా శ్రీయను తీసుకున్నారు. మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. `మహానటి`తో తెలుగువారికి చేరువైన కీర్తి సురేష్‌ను కూడా సంప్రదించారట. అయితే ఆమె ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. చివరకు అంజలిని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  

Advertisement
Advertisement
Advertisement