Oct 20 2021 @ 13:31PM

కీర్తి సురేశ్ దర్శకుడి సంచలన నిర్ణయం..

ఇంతకముందు కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో 'మిస్ ఇండియా' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ నరేన్ దర్శకత్వం వహించాడు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కూడా మేకింగ్ పరంగా దర్శకుడు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి మూవీతో రాబోతున్నాడో అని అందరూ అనుకుంటున్న సమయంలో ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయనే నిర్మాతగా, గోల్డెన్ డైమండ్ ఎంటెర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ను స్థాపించి యంగ్ టాలెంట్‌కు అవకాశాలు కల్పించబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఈ బ్యానర్‌ ద్వారా వెబ్ సిరీస్, యూట్యూబ్ కంటెంట్‌ను అందివ్వబోతున్నారు. ఇందుకోసం యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే విధంగా ప్లాన్ చేసినట్టు దర్శక, నిర్మాత నరేన్ వెల్లడించారు. నిజంగా ఇది యూత్‌కు మంచి ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు.