Jul 21 2021 @ 19:52PM

కీర్తి సురేష్‌ ఎలా విహారం చేస్తుందో చూశారా?

సీనియర్‌ నటి మేనక వారసురాలిగా సినీ పరిశ్రమకు పరిచయమైన నటి కీర్తి సురేష్‌. తమిళం, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన కీర్తి... ఆ తర్వాత శివకార్తికేయన్‌ నటించిన ‘రజిని మురుగన్‌’ అనే చిత్రంలో నటించి మంచి పాపులర్‌ అయ్యారు. ఆ వెంటనే ‘తొడరి’, ‘భైరవ’, ‘రెమో’, ‘సామి-2’, ‘సర్కార్‌’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రముఖ సీనియర్‌ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నడిగైయార్‌ తిలగం’ అనే చిత్రంలో నటించి జాతీయ అవార్డును అందుకున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం ‘అణ్ణాత్త’లో నటించే అవకాశాన్ని కీర్తి దక్కించుకుంది. 


అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలల పాటు తన ఇంటికే పరిమితమైన కీర్తి.. ఇపుడిపుడే సినిమా షూటింగులకు వెళుతున్నారు. తాజాగా ‘సానికాగితం’ అనే చిత్రం షూటింగ్‌ రామేశ్వరంలో జరుగుతుంది. దీని కోసం రామేశ్వరం వెళ్ళిన కీర్తి.. అక్కడ సముద్ర తీర అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు. ఇదిలావుంటే, ‘సానికాగితం’ ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే రిలీజ్‌ చేయగా, ఇందులో ఆమె పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధాలు పట్టుకుని దోపిడీ దొంగలా కీర్తి సురేష్‌ స్టిల్‌ ఉండగా, దీనికి నెటిజన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది.