May 13 2021 @ 07:55AM

సబార్డినేట్‌గా కీర్తి సురేష్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట'లో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్‌కు సబార్డినేట్‌గా ఆమె కనిపించబోతుందని సమాచారం. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతి నేపథ్యానికి సామాజిక అంశాలను జోడించి పరశురాం తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. బ్యాంక్ మేనేజర్ పాత్రలో మహేష్.. అదే బ్యాంక్‌లో ఉద్యోగినిగా కీర్తి సురేష్ కనిపించబోతున్నారట. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాతికి 'సర్కారు వారి పాట' రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు మహేష్.