మైక్రో ఆర్ట్‌ విభాగంలో కీర్తనకు మెరాకిల్స్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం

ABN , First Publish Date - 2021-10-17T04:36:57+05:30 IST

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 పిస్తా పప్పులపై 75 మంది స్వాతంత్య్ర సమరయోధులు, 75 పిస్తా పప్పులపై భారత సంప్రదాయ సంస్కృతి సంబంధించిన చిత్రాలు చిత్రించిన పొదల కీర్తనకు మైక్రో ఆర్ట్‌ విభాగంలో మెరాకిల్స్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం దక్కింది.

మైక్రో ఆర్ట్‌ విభాగంలో   కీర్తనకు మెరాకిల్స్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం
కలెక్టర్‌ నుంచి వార్డు అందుకుంటున్న కీర్తన

నెల్లూరు(సాంస్కృతికం), అక్టోబరు 16: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 పిస్తా పప్పులపై 75 మంది స్వాతంత్య్ర సమరయోధులు, 75 పిస్తా పప్పులపై భారత సంప్రదాయ సంస్కృతి సంబంధించిన చిత్రాలు చిత్రించిన పొదల కీర్తనకు మైక్రో ఆర్ట్‌ విభాగంలో మెరాకిల్స్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం దక్కింది. ఈ మేరకు ఆ సంస్థ వారు ప్రపంచ రికార్డుగా ధ్రువీకరణ పత్రము, బంగారు పథకం పంపారు. వాటిని జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు చేతుల మీదుగా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం కీర్తన అందుకున్నారు. కీర్తన వేసిన చిత్రాలను చూసి కలెక్టర్‌ అభినందించారు. కీర్తన గురువు, ప్రముఖ చిత్రకారుడు షేక్‌.అమీర్‌జాన్‌ మాట్లాడుతూ నా విద్యార్థి కీర్తన ప్రపంచ రికార్డు సాఽధించడం ఎంతగానో సంతోషంగా ఉందన్నారు. అమీర్‌ఆర్ట్స్‌ అకాడమీ నందు మొట్టమొదటి ప్రపంచ రికార్డు సాధించిన విద్యార్థిగా కీర్తన పేరు నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తన తల్లి భారతి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T04:36:57+05:30 IST