Abn logo
Sep 21 2020 @ 11:59AM

మరోసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి, కాలభైరవ

Kaakateeya

ప్రముఖ సంగీత  దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆయన తనయుడు యువ సంగీత దర్శకుడు, సింగర్‌ కాలభైరవ మరోసారి ప్లాస్మా దానం చేశారు. కొన్నిరోజుల ముందు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి సహా కొందరు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ సోకింది. అయితే వీరందరూ కరోనా ఎఫెక్ట్‌ నుండి బయటపడ్డారు. వీరిలోకీరవాణి, కాలభైరవ కరోనా వారియర్స్‌గా మారి ప్లాస్మాను దానం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కీరవాణి, కాలభైరవ ప్లాస్మాను దానం చేశారు. ఈ విషయాన్ని కాలభైరవ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కోవిడ్‌ ఎఫెక్ట్‌ నుండి బయటపడ్డవారు యాంటీ బాడీస్‌ను చెక్‌ చేసుకుని వీలైతే మరోసారి ప్లాస్మాను దానం చేయాలంటూ కోరుతూ ప్లాస్మాను దానం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. 



Advertisement
Advertisement
Advertisement