Abn logo
Sep 21 2020 @ 10:36AM

`ఆర్ఆర్ఆర్` కంటే ముందు ఆ రెండు సినిమాలు చేస్తున్న కీరవాణి!

Kaakateeya

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ సినిమాపై కరోనా చాలా పెద్ద దెబ్బ కొట్టింది. భారీ సినిమా కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కువ మంది సిబ్బంది అవసరం. 


కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అంత మందితో షూటింగ్ చేయడం ప్రమాదకరం. అందుకే మిగిలిన సినిమా షూటింగ్‌లు ప్రారంభమవుతున్నా `ఆర్ఆర్ఆర్` యూనిట్‌లో ఎలాంటి కదలికా లేదు. ఇప్పట్లో షూటింగ్ ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎమ్ఎమ్ కీరవాణి చేసిన ట్వీట్ కూడా ఆ దిశగానే ఉంది. `ప్రస్తుతం నేను రెండు సినిమాలకు పనిచేస్తున్నాను. డైరెక్టర్ క్రిష్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న సినిమాకు, కె.రాఘవేంద్రరావు సంస్థ నిర్మించనున్న సినిమాకు సంగీతం అందిస్తున్నాను. `ఆర్ఆర్ఆర్` పనులు త్వరలో ప్రారంభిస్తాన`ని కీరవాణి ట్వీట్ చేశారు.



Advertisement
Advertisement
Advertisement