పరిశుభ్రతతో వ్యాధులు దూరం: డిప్యూటీ డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2022-07-06T05:55:34+05:30 IST

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరమవుతాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నిరంజన్‌ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మలేరియా, డెంగీ నివారణ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి, మాట్లాడారు.

పరిశుభ్రతతో వ్యాధులు దూరం: డిప్యూటీ డీఎంహెచ్‌వో
మఠంపల్లిలో డెంగీ, మలేరియా నివారణ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది

మఠంపల్లి / నేరేడుచర్ల / గరిడేపల్లి / చిలుకూరు / మేళ్లచెర్వు,  జూలై 5 : పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరమవుతాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నిరంజన్‌ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మలేరియా, డెంగీ నివారణ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కేవలం  దోమకాటు ద్వారా మాత్రమే డెంగీ, మలేరియా వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంతో పాటు దోమల నివారణకు దోమతెరలు, నీటినీల్వ లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఫిరోజ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. తుంగతుర్తిలో నిర్వహించిన డెంగీ నివారణ మాసోత్సవ ర్యాలీలో వైద్యాధికారి  నాగునాయక్‌, హెచ్‌ఈవోలు బొమ్మగాని నర్సయ్య, సముద్రాల సూరి, పీహెచ్‌ఎన్‌ ఆకారపు సైదమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. నేరేడుచర్లలో నిర్వహించిన ర్యాలీలో వైద్యాధికారి నాగయ్య, సిబ్బంది డి.శ్యాంసుందర్‌రెడ్డి, జయమ్మ, నర్సయ్య, పుష్ప, రాంబాబు, విజయ, సుశీల, సునిత, మమత, నాగమణి పాల్గొన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని ర్యాలీలో వైద్యాధికారి జగదీశ్వర్‌, డాక్టర్‌ సంతో్‌షకుమార్‌, పీహెచ్‌ఎన్‌ జి.ప్రమీల, సూపర్‌వైజర్‌ ఎన్‌.అంజయ్యగౌడ్‌, సోములమ్మ, ఉపేంద్ర, ఫార్మసిస్ట్‌ కృష్ణ, మమత, ఏఎన్‌ఎంలు కవిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చిలుకూరులో  డెంగీ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి తేజస్విని, కార్యదర్శి  శోభన్‌బాబు, సీహెచ్‌వో వినోద్‌ పాల్గొన్నారు. మేళ్లచెర్వులో జరిగిన ర్యాలీలో జిల్లా టీకాల అధికారి  వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్యకర ఆహారంతో అనారోగ్య సమస్యలు దగ్గరకు రావన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రేమ్‌సింగ్‌, సీహెచ్‌వో కృష్ణయ్య, సీహెచ్‌ఎం జి.పద్మ, సూపర్‌ వైజర్‌ కె.ఉపేంద్ర, సీహెచ్‌ రాజకుమార్‌, ఎంపీడీవో ఇసాక్‌హుస్సేన్‌, ఎంపీపీ కొట్టె సైదేశ్వరరావుపద్మ, జడ్పీటీసీ పద్మారెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.





Updated Date - 2022-07-06T05:55:34+05:30 IST