బాలీవుడ్‌ భాస్వరం

ABN , First Publish Date - 2022-04-24T17:59:00+05:30 IST

సినిమాలకంటే ఎక్కువగా సోషల్‌ మీడియాతో పాపులర్‌ అవుతుంటుంది. ‘ఇదో చిన్న విషయం. నేను నమ్మాను కాబట్టే ట్విటర్‌ ద్వారా మాట్లాడతా. ఆ పరిస్థితులకు

బాలీవుడ్‌ భాస్వరం

తను వెడ్స్‌ మను, రాంజానా సినిమాలతో పాపులరైన నటి స్వరా భాస్కర్‌.  నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈమె.. ట్విటర్‌ వ్యాఖ్యలతో  నెటిజన్స్‌ ట్రోల్స్‌కి గురి అవుతుంటుంది. అయినప్పటికీ ఆమె తన స్వరం వినిపించటం మానదు.


సినిమాలకంటే ఎక్కువగా సోషల్‌ మీడియాతో పాపులర్‌ అవుతుంటుంది. ‘ఇదో చిన్న విషయం. నేను నమ్మాను కాబట్టే ట్విటర్‌ ద్వారా మాట్లాడతా. ఆ పరిస్థితులకు అనుగుణంగా నా ఆలోచనలకు కన్విన్స్‌ అయ్యాకనే.. స్పందిస్తుంటా. నేను ఎవరి పెయిడ్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ను కాదు’ అంటుందామె. 

అందుకే ఈ ఆటిట్యూడ్‌..

ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఎమ్‌.ఎ. ఇంగ్లీష్‌ లిటరేచర్‌ తర్వాత ఎమ్‌.ఎ. సోషియాలజీ జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదివింది. ఆ సమయంలోనే పలు సోషల్‌ యాక్టివిటీ్‌సలో పాల్గొంది. అప్పుడే ఈ స్వరం పుట్టింది. ఆ తర్వాత 2008లో ముంబైకి మకాం మార్చింది. సినిమాల్లోకి రావాలనుకుంది. మోడలింగ్‌ చేసింది. ముంబైలో తన ఫ్రెండ్‌తో కలిసి అద్దె ఇంటికోసం తిరిగితే ఎవరూ ఇవ్వలేదట. ‘ఆడపిల్లలం రెంట్‌ కోసం తిరిగితే ఇవ్వరా? ఖాళీగా ఉన్నా ఇవ్వకపోవడమేంటీ? ఇది మా ఫండమెంటల్‌ రైట్‌’ అంటూ లాండ్‌లార్డ్స్‌తో వాదించేదట. అయితే వాళ్లు ‘కొత్త ఇల్లు కొనుక్కో’ అనేవారట. అయితే ప్రశ్నించటంలో  ఈమె ఎక్కడైనా ముందే ఉండేది. ఆ ఆటిట్యూడ్‌ ట్విటర్‌లోనూ కనపడుతుంది. 

‘‘చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనించటం నాకు ఆసక్తి. పాలిటిక్స్‌. పవర్‌ డైనమిక్స్‌తో పాటు అనేక సామాజిక విషయాలను ట్విటర్‌లో అభిప్రాయాలు పంచుకుంటా’’


సహాయనటిగా గుర్తింపు..

2009లో ‘మధులాల్‌ కీప్‌ వాకింగ్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ‘గుజారిష్‌’ సినిమాల్లో నటించినా పేరు రాలేదు. ఆ తర్వాత ‘తను వెడ్స్‌ మను’ చిత్రంలో సహనటి పాత్రకు పలు అవార్డులు వచ్చాయి. 2014లో వచ్చిన ‘రాంజానా’ చిత్రం ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’లో సల్మాన్‌ చెల్లెలిగా నటించింది. కేవలం సహాయనటి పాత్రలతోనే గుర్తింపు సంపాదించుకుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లితెర సిరీ్‌సల్లో నటించి పేరు తెచ్చుకుంది. బోల్డ్‌ లుక్‌ పాత్రలనే ఎంచుకుంది. ‘ఫ్లెష్‌’ అనే టీవీ సిరీ్‌సలో చేసిన ఏసీపీ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే ‘వీరే ది వెడ్డింగ్‌’ అడల్ట్‌ కంటెంట్‌ మూవీలో స్వర చేసిన పాత్రకు విమర్శలొచ్చాయి. ‘అయితే అందులో తప్పేముంది? నా పాత్రలో నటించానంతే’ అంటుంది స్వర భాస్కర్‌. రాజకీయాలంటే ఇష్టపడుతుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్‌ చద్దా తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంది. ‘ఒక మహిళగా గట్టిగా స్వరం వినిపించకపోతే బతకలేం. ఫెమినిస్ట్‌ భావజాలం లేదు. ఏదైనా తప్పు ఉంటే తప్పక ప్రశ్నిస్తా’ అంటుంది స్వరభాస్కర్‌. ఆరోగ్యం, విద్య, జెండర్‌ ఈక్వాలిటీ, రాజకీయాలు.. ఇలా పలు అంశాలపై ట్విటర్‌లో స్పందిస్తుంటుంది. అయితే కొసమెరుపు ఏంటంటే.. ‘నేను యాక్టర్‌ను. బాలీవుడ్‌ కంటే ఎక్కువ. సోషల్‌ మీడియాలో నన్ను ట్రోలింగ్‌ చేసేవాళ్లకు కొన్నేళ్లనుంచీ ఎంప్లాయింట్‌మెంట్‌ ఇచ్చా’ అంటూ తన ట్విటర్‌ పేజీలో రాసుకుందంటే.. ఆమె ధైర్యం ఏపాటిదో ఎవరికైనా అర్థం అవుతుంది.

Updated Date - 2022-04-24T17:59:00+05:30 IST