కీప్‌ ఇండియా స్మయిలింగ్‌ ఫౌండేషనల్‌ స్కాలర్‌షిప్‌

ABN , First Publish Date - 2022-09-21T22:13:57+05:30 IST

కోల్గేట్‌ - పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్‌ - ‘కీప్‌ ఇండియా స్మయిలింగ్‌ ఫౌండేషనల్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ మెంటార్‌షిప్‌’ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. పదోతరగతి, ఇంటర్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై

కీప్‌ ఇండియా స్మయిలింగ్‌ ఫౌండేషనల్‌ స్కాలర్‌షిప్‌

కోల్గేట్‌ - పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్‌ - ‘కీప్‌ ఇండియా స్మయిలింగ్‌ ఫౌండేషనల్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ మెంటార్‌షిప్‌’ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. పదోతరగతి, ఇంటర్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు దీనిని ఉద్దేశించారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు. ఆసక్తిగల విద్యార్థులు డిసెంబరు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డ్‌/ డ్రైవింగ్‌ లైసెన్స్‌/ ఓటర్‌ ఐడీ కార్డ్‌/ పాన్‌ కార్డ్‌, కులం - వైకల్యం - ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, పదోతరగతి మార్కుల పత్రం, ఇంటర్‌/ తత్సమాన కోర్సు మార్కుల పత్రాలు, అడ్మిషన్‌ లెటర్‌/ కాలేజ్‌ ఐడీ కార్డ్‌/ అడ్మిషన్‌ ఫీజు రిసీట్‌ అప్‌లోడ్‌ చేయాలి.


ఇంటర్‌ విద్యార్థులకు

అర్హత: ఈ ఏడాది పదోతరగతిలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన కాలేజ్‌లో ఇంటర్‌ / పదకొండో తరగతిలో ప్రవేశం పొంది ఉండాలి.

రివార్డ్‌: ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.  


డిగ్రీ విద్యార్థులకు

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్‌ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. 

రివార్డ్‌: ఏడాదికి రూ.30,000 చొప్పున మూడేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.


క్రీడాకారులకు

అర్హత: చదరంగం, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, బాడ్మింటన్‌, సైక్లింగ్‌, జిమ్నాస్టిక్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, పవర్‌ లిఫ్టింగ్‌, రన్నింగ్‌ తదితర వ్యక్తిగత క్రీడల్లో ప్రావీణ్యం ఉండాలి. గడచిన మూడేళ్లలో రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం / దేశం తరపున  ఏ క్రీడా విభాగంలోనైనా ప్రాతినిధ్యం వహించి ఉండాలి. దేశవ్యాప్తంగా 500 లోపు, రాష్ట్రవ్యాప్తంగా 100 లోపు ర్యాంకు సాధించి ఉండాలి. ఆగస్టు 31 నాటికి 9 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రముఖ క్రీడా సంస్థ / ఫెడరేషన్‌ / అకాడమీ / కోచ్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉండాలి. 

రివార్డ్‌: ఏడాదికి రూ.75,000 చొప్పున మూడేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.


ప్రొఫెషనల్‌ కోర్సులు చేసేవారికి

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఒకదానిలో ఫస్టియర్‌ అడ్మిషన్‌ పొంది ఉండాలి. 

రివార్డ్‌: ఏడాదికి రూ.30,000 చొప్పున నాలుగేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.  


సమాజ సేవకులకు

అర్హత: చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద పిల్లలకు చదువు చెప్పడం, క్రీడలలో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉండాలి. ప్రస్తుతానికి 20 నుంచి 25 మందికి శిక్షణ ఇచ్చి ఉం డాలి. కనీసం గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.

రివార్డ్‌: ఏడాదికి రూ.75,000 చొప్పున రెండేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.

వెబ్‌సైట్‌: https://www.colgate. com/en-in/smile-karo-aur-shuru-ho-jao/foundation-scholarship

Updated Date - 2022-09-21T22:13:57+05:30 IST