నిషేధిత వస్తువులపై నిఘా పెట్టండి

ABN , First Publish Date - 2021-07-25T07:11:53+05:30 IST

ఆర్టీసీ బస్సులో నిషేధిత వస్తువులు రవాణా కాకుండా నిఘా పెట్టాలని సిబ్బందికి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి సూచించారు.

నిషేధిత వస్తువులపై నిఘా పెట్టండి
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న చెంగల్‌రెడ్డి

ఆర్టీసీ సిబ్బందికి ఆర్‌ఎం సూచన


తిరుపతి(కొర్లగుంట), జూలై 24: ఆర్టీసీ బస్సులో నిషేధిత వస్తువులు రవాణా కాకుండా నిఘా పెట్టాలని సిబ్బందికి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి సూచించారు. శనివారం తన కార్యాలయంలో ఈ అంశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి, ప్రసంగించారు. ప్రధానంగా విశాఖ, విజయవాడ నుంచి వస్తున్న బస్సుల్లో సామాన్య ప్రయాణికుల వలె మహిళలు, యువకులు గంజాయి రవాణా చేస్తున్నారని చెప్పారు. అలాగే గుట్కా, పాన్‌పరాగ్‌, మద్యంతోపాటు పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు లభించే వస్తువులను తీసుకొస్తున్నారన్నారు. అందువల్ల ప్రయాణికుల తెచ్చే పెద్ద పెద్ద బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అనుమానం ఉన్న వారిని సమీపంలోని పోలీసులకు అప్పగించాలని సూచించారు. కార్గో ద్వారా కూడా నిషేదిత వస్తువులు తరలిస్తున్నట్లు సమచారం ఉందని, అక్కడి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయాలపై ప్రయాణికులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. సంఘ విద్రోహులకు సిబ్బంది సహకరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డిప్యూటీ ట్రాఫిక్‌ మేనేజర్‌ మధుసూదన్‌, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌, డిపో మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌, అసిస్టెంట్‌ మేనేజన్‌ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T07:11:53+05:30 IST