రైతులు, కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్!

ABN , First Publish Date - 2020-06-05T10:28:08+05:30 IST

సహకారం రంగంలో నడుస్తున్న జిల్లాలోని..

రైతులు, కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్!

కోవూరు షుగర్స్‌పై కన్ను

ఆత్మకూరు బస్టాండు తరలింపునకు సన్నాహాలు


కోవూరు / నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సహకారం రంగంలో నడుస్తున్న జిల్లాలోని ఏకైక సహకార చక్కెర కర్మాగారాన్ని బస్టాండుగా మార్చేందుకు పలువురు రహస్యంగా పావులు కదుపుతున్నారు. నిరాదరణకు గురై శిథిలావస్ధకు చేరుకున్న చక్కెర కర్మాగారాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగపెట్టాలనే ఆలోచనతో జిల్లాకు చెందిన ప్రముఖులున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండును కోవూరు చక్కెర కర్మాగారం ఉన్న ప్రదేశానికి మార్చే ప్రతిపాదన రాష్ట్రమంత్రి అనిల్‌కుమార్‌ మదిలో మెదిలినట్లు అనుమానిస్తున్నారు.


ప్రభుత్వ స్ధలాన్ని పరిశీలించండి అని కూడా అధికారుల్ని ఆదేశించారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సహకారమందిస్తే ఆత్మకూరు బస్టాండును కోవూరు ప్రాంతానికి తరలిస్తామని కూడా ప్రకటించారు. ఎప్పటికైనా ఫ్యాక్టరీని పునరుద్ధరించి గానుగ ఆడించి పూర్వవైభవం తీసుకువస్తారని ఆశిస్తున్న చెరకు రైతులకు, కార్మికులకు మంత్రి అనిల్‌ మాటలతో నడ్డి విరిగినట్లైంది.


మంత్రి స్థల పరిశీలన

జిల్లా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ గురువారం కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ స్థలాలను పరిశీలించారు. కోవూరు వద్దకు ఆత్మకూరు బస్టాండును మారిస్తే కొత్తకోడూరు, కావలి, అల్లూరు, బుచ్చి వంటి ప్రాంతాలకు ఆటోల తాకిడి అధికమయ్యే అవకాశం ఉంది. ప్రజలకు సైతం నెల్లూరు  నుంచి కోవూరు వరకు ఆటోల్లో వెళ్లేందుకు అధిక ఖర్చు అవుతుంది. అయితే ఈ బస్టాండు మారితే నగర ప్రజలకు మాత్రం ట్రాఫిక్‌ కష్టాలు తగ్గుతాయి. 

Updated Date - 2020-06-05T10:28:08+05:30 IST