ధర ఎక్కువనే కేదార్‌పై వేటు: గంభీర్‌

ABN , First Publish Date - 2021-01-26T08:34:25+05:30 IST

గతేడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌లో సమూల మార్పులుంటాయని అంతా భావించారు. కానీ సీఎ్‌సకే కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే తొలగించింది...

ధర ఎక్కువనే కేదార్‌పై వేటు: గంభీర్‌

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌లో సమూల మార్పులుంటాయని అంతా భావించారు. కానీ సీఎ్‌సకే కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే తొలగించింది. షేన్‌ వాట్సన్‌ ఇదివరకే రిటైరయ్యాడు. ఇది ధోనీ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ అని మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కొనియాడాడు. అతడు కేవలం ఒక సీజన్‌ గురించే ఆలోచిస్తాడని చెప్పాడు. ఇక కేదార్‌ జాదవ్‌ ధర ఎక్కువ కాబట్టే అతడిని జట్టు వదిలేసిందని, లేకుంటే మరో అవకాశం ఇచ్చేదని అభిప్రాయపడ్డాడు. 2018 వేలంలో జాదవ్‌ను రూ.7.8 కోట్లకు చెన్నై కొనుగోలు చేసుకున్నా, తను పూర్తిగా నిరాశపరిచాడు.

Updated Date - 2021-01-26T08:34:25+05:30 IST