కేడీసీసీబీని రైతులకు చేరువ చేయాలి

ABN , First Publish Date - 2021-07-31T05:57:06+05:30 IST

కేడీసీసీబీని రైతులకు చేరువ చేయాలి

కేడీసీసీబీని రైతులకు చేరువ చేయాలి
కేడీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న తన్నీరు. చిత్రంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని తదితరులు

కేడీసీసీబీ చైర్మన్‌గా తన్నీరు ప్రమాణస్వీకారం

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ)ను రైతులకు మరింత చేరువ చేయాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు. కేడీసీసీబీ చైర్మన్‌గా తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం శుక్రవారం స్థానిక కేడీసీసీ బ్యాంకులో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కేడీసీసీబీ ద్వారా రైతులకు, కౌలు రైతులకు సకాలంలో రుణాలు అందజే యాలన్నారు. కేడీసీసీబీ చైర్మన్‌ త న్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకు టర్నోవర్‌ రూ.7,150 కోట్లుగా ఉందని, దీనిని రూ.10వేల కోట్లకు పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికను తయారు చేశామన్నారు. వాణిజ్య బ్యాంకుల మాదిరిగా కాకుండా కేడీసీసీబీ ద్వారా ఆరుశాతం వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. కేడీసీసీబీ పరిధిలోని 58 శాఖల్లో పురోభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆగస్టు 2, 3 తేదీల్లో 100 పోస్టులను పార దర్శకంగా భర్తీ చేస్తామన్నారు. జిల్లా మంత్రులు, అధికారుల సహకారంతో బ్యాంకును మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. డిపాజిట్ల సేకరణ, రుణాలు రూ.10వేల నుంచి రూ.40లక్షల వరకు ఇస్తామన్నారు. విద్య, కర్షకమిత్ర రుణాలు వంటివి కేడీసీసీబీ ద్వారా ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. మంత్రి కొడాలి నాని, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, కేడీసీసీబీ సీఈవో ఎ.శ్యామ్‌మనోహర్‌, పాలకవర్గ సభ్యులు, అధికారులు తదితరులు తన్నీరును అభినందించారు. కాగా, మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ వెంకటేశ్వరమ్మ తదితరులు తన్నీరును సత్కరించారు. అక్కడి నుంచి కేడీసీసీబీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు.

Updated Date - 2021-07-31T05:57:06+05:30 IST