మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-06-26T04:59:35+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుందని, కాళేశ్వరం ప్రాజె క్టు పేరుతో సీఎం కేసీఆర్‌ కోట్లు వెనకేసుకున్నారని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు.

మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్‌
జూరాల ప్రాజెక్టును పరిశీలిస్తున్న టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌, నాయకులు

- ప్రాజెక్టులను పూర్తిచేయడంలో విఫలం

- టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌

ధరూరు/గట్టు/మల్దకల్‌, గద్వాలటౌన్‌, జూన్‌ 25: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుందని,  కాళేశ్వరం ప్రాజె క్టు పేరుతో సీఎం కేసీఆర్‌  కోట్లు వెనకేసుకున్నారని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. తుంగభద్ర నది జలాల పరిరక్షణ యాత్రలో భాగంగా శనివారం ఆయన జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు స్టేజీ 1, ర్యాలంపా డు రిజర్వాయర్లను, గట్టు మండలంలో ఆలూరు, గట్టు, గజ్జలగట్టు దగ్గర నిర్మాణం చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పనులను ఆయన పరిశీ లిం చారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమా వేశాల్లో కోదండరామ్‌ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బాగుపడతామని పోరాడినోల్లం.. నేడు సాధించుకున్న తెలంగాణలో చేస్తున్న అభివృద్ధిని చూసి సిగ్గేస్తుందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పింఛన్లు, రుణమాఫీ, దళితబంధు పథకా లు ప్రజలకు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజలు రాజకీయ మార్పు దిశగా ఆలోచించాలని సూచించారు.  అలాగే మల్దకల్‌ బస్టాండ్‌ సమీ పంలో రైతులతో మాట్లాడారు. నడిగడ్డలో నదీజలాల సాధనకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.    గద్వాల పట్టణ సమీపం దౌదర్‌పల్లి శి వారులో 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప ట్టాలు ఇచ్చిన నివేశన స్థలాలు తమకే దక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీజేఎస్‌ రాష్ట్ర అ ధ్యక్షుడు కోదండరామ్‌ను కలిసి బాధితులు వి నతిప్రతం అందజేశారు.  మా స్థలాల్లో నర్సింగ్‌ కళాశాల, కొత్త 300పడకల ఆస్పత్రి నిర్మాణానికి పూనుకుంటున్నారని, తమకు న్యాయం చేయాల ని వారు కోరారు. బాధితుల వెంట కాంగ్రెస్‌ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్‌ ఎండీ ఇసాక్‌, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, బీజేపీ నాయకులు రజక నరసింహా ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో   టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఆలూరు ప్రకాష్‌గౌడు, రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు లక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మరాజు, శ్యాంప్రసాద్‌రెడ్డి, పూజారెడ్డి, నాగేష్‌, వీరేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T04:59:35+05:30 IST