ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌ సంక్రాంతి సంబురాలు!

ABN , First Publish Date - 2022-01-15T09:50:21+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌ్‌సలోనే సంక్రాంతి పండుగ జరుపుకోనున్నట్లు తెలిసింది.

ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌ సంక్రాంతి సంబురాలు!

జగదేవపూర్‌, జనవరి 14: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌ్‌సలోనే సంక్రాంతి పండుగ జరుపుకోనున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌.. వివిధ పార్టీల నేతలతో సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఈనెల 11న మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన సీఎం మూడు రోజులుగా ఇక్కడే ఉన్నారు. శనివారం కూడా ఇక్కడే ఉండనున్నట్లు తెలిసింది. వ్యవసాయ క్షేత్రంలోనే కుటుంబ సమేతంగా పండుగను జరుపుకోనున్నట్లు సమాచారం.

Updated Date - 2022-01-15T09:50:21+05:30 IST