ఓటు హక్కు వినియోగించుకోని కేసీఆర్

ABN , First Publish Date - 2021-12-10T22:23:36+05:30 IST

6 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. దాదాపు 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకోని కేసీఆర్

హైదరాబాద్: 6 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. దాదాపు 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లకు సిబ్బంది తరలించింి. ఈనెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రల్లో 100శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మెదక్ స్థానానికి 99 ఓట్లలో 98 ఓట్లు పోలయ్యాయి. అయితే ఓటు హక్కును సీఎం కేసీఆర్ వినియోగించుకోలేదు. మెదక్ జిల్లా నుంచి ఎక్స్‌అఫీషియో ఓటర్‌గా కేసీఆర్ ఉన్నారు. 


రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగా, ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. ఆదిలాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దండె విఠల్‌, స్వత్రంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి పోటీలో ఉన్నారు. నల్లగొండ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి బరిలో ఉండగా.. మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు.


Updated Date - 2021-12-10T22:23:36+05:30 IST