Abn logo
Sep 25 2021 @ 01:29AM

కేసీఆర్‌ను గద్దె దింపాలి

మాట్లాడుతున్న కేంద్ర సహాయ మంత్రి రావు సాహెబ్‌ దాదారావు ధన్వే పాటిల్‌

- వాగ్దానాల అమలేది? 

- సమస్యల పరిష్కారం కోసమే సంగ్రామ యాత్ర

- కేంద్ర సహాయ మంత్రి రావు సాహెబ్‌ దాదారావు ధన్వేపాటిల్‌


సిరిసిల్ల సెప్టెంబరు 24  (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర రైల్వే, బొగ్గు, మైనింగ్‌ శాఖ సహా య మంత్రి రావు సాహెబ్‌ దాదారావు ధన్వే పాటిల్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో శుక్రవారం కొనసాగింది. యా త్రలో ధన్వే పాటిల్‌ ప్రజల సమస్యలను స్వయంగా తెలు సుకున్నారు. అనంతరం ముస్తాబాద్‌ మండలం చీకో డులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని, ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు. ప్రజల గోడు వినేవారు లేరని భావిస్తున్న తరుణంలో సమస్యల పరిష్కారం కోసం బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారన్నారు.  ప్రజాస మస్యలు తెలుసుకొని వారికి భరోసా కల్పిస్తూ చేపట్టిన బండి సంజయ్‌ మొదటి దశ యాత్ర అక్టోబరు 2న ముగుస్తుందన్నారు. సంగ్రామ యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు వారి గోడును చెప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీలు సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల వద్దకు వెళ్లడం లేదన్నారు. ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజ లకు చేసిందేమీ లేదన్నారు.  కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారన్నారు. దళిత ముఖ్యమంత్రి నియా మకం, దళితులకు మూడెకరాల భూమి, బలహీన వర్గాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు కావడం లేదన్నారు. మరోవైపు సమస్యలు పట్టించుకునే వారే కరవయ్యా రన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే బండి సంజయ్‌ పాదయ్రాత చేస్తున్నారన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించడమే కానీ కేంద్రం ఇప్ప టి వరకు ఇచ్చిన డబ్బుల లెక్కలు చెప్పడం లేదని అన్నారు. కరోనా మహమ్మారిని ప్రధానమంత్రి నాయక త్వంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు.  ప్రపం చంలో అతిపెద్ద రెండో దేశంగా భారత్‌ అన్ని రంగాల్లో ముందు కెళ్తోందన్నారు. బియ్యం, గోధుమలు పేదలకు ఉచితంగా ఇస్తున్నట్లు,  80 కోట్ల మంది భారతీయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.  తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం నిధులు విడుదల చేసేం దుకు సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైల్వే అభి వృద్ధి కోసం సంప్రదించలేదని తెలిపారు. బండి సంజయ్‌ పాదయాత్రకు మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా  ఆశీర్వాదం ఉందన్నారు. తెలంగాణలో 2023లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీపై దేశవ్యాప్తంగా ప్రజల్లో నమ్మకం ఉందని, మోదీ ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే మృత్యుం జయం, బీజేపీ సీనియర్‌ నాయకులు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.