సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2020-11-21T18:01:35+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగాలని భావించిన కొందరు సిట్టింగ్‌లకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు.

సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగాలని భావించిన కొందరు సిట్టింగ్‌లకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. 27 మంది సిట్టింగ్‌ల స్థానాల్లో ఇతరులకు అవకాశం కల్పించారు. ఇందులో కొందరు అనారోగ్యం, ఇతరాత్ర కారణాలతో అభ్యర్థులే పోటీకి నిరాసక్తత చూపగా స్థానికంగా నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలోనే మిగతావారిని అధిష్టానం మార్చింది.


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు టీఆర్ఎస్ మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడగా టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కోకార్పొరేటర్ గులాబీ గూటికి చేరారు. దీంతో గ్రేటర్‌లో అధికారపార్టీ సిట్టింగ్‌ల సంఖ్య 99గా ఉంది. అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ భారీ కసరత్తు చేసినట్లుగా సమాచారం. సిట్టింగులు, ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం సేకరించారు. ఆ నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-11-21T18:01:35+05:30 IST