ఉద్యమకారుల కోసం కేసీఆర్‌ ఏం చేశారు?: షర్మిల

ABN , First Publish Date - 2022-06-03T01:50:35+05:30 IST

ఉద్యమకారుల కోసం సీఎం కేసీఆర్‌ (KCR‌) ఏం చేశారు? అని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల (Sharmila) ప్రశ్నించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని

ఉద్యమకారుల కోసం కేసీఆర్‌ ఏం చేశారు?: షర్మిల

ఖమ్మం: ఉద్యమకారుల కోసం సీఎం కేసీఆర్‌ (KCR‌) ఏం చేశారు? అని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల (Sharmila) ప్రశ్నించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ వాడుకున్నారా.. లేక ఉద్యమం కేసీఆర్‌ను వాడుకుందా? అని ప్రశ్నించారు. ఉద్యమమే కేసీఆర్‌ను నిలబెట్టిందని, సీఎంను చేసిందన్నారు. రెండోసారి ఎన్నికల్లోనూ కేసీఆర్‌ను ఉద్యమమే నిలబెట్టిందన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలు చేస్తే ఎంతమందిని ఆదుకున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడినవారిని రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ గడ్డం పెంచుకుని దీక్ష చేసినట్లు నాటకం ఆడారని షర్మిల ధ్వజమెత్తారు.

Updated Date - 2022-06-03T01:50:35+05:30 IST