కేసీఆర్‌ హామీలు అమలుకు నోచుకోలేదు

ABN , First Publish Date - 2022-08-15T04:56:29+05:30 IST

సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచు కోలేదని ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర నిరస నతో ఉన్నారని మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

కేసీఆర్‌ హామీలు అమలుకు నోచుకోలేదు

- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచు కోలేదని ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర నిరస నతో ఉన్నారని మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 10 రోజుల పాటు 125 కిలోమీటర్ల దూరం పాదయాత్రలో భాగంగా 6వ రోజు ఆదివారం కరీంనగర్‌కు చేరుకున్నారు. పాదయాత్రలో భాగంగా కొత్తపల్లి మండలం చింత కుంట, కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారానికి పోరాటం చేసేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు  తెలి పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కరీంనగర్‌, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, సత్యనారాయణగౌడ్‌, చొప్పదండి, వేములవాడ ఇన్‌ చార్జీలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీని వాస్‌, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 

 కరీంనగర్‌ రూరల్‌ : భారత దేశాన్ని అమ్మటమే బీజేపీ లక్ష్యమని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం రాములపల్లి నుం చి ప్రారంభమైన పాదయాత్ర చింతకుంట, శాంతినగర్‌ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప ప్రస్తుతం ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌టి సెల్‌ జిల్లా అధ్యక్షుడు బానోతు శ్రావణ్‌ నాయక్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోనాల మురళీమనోహర్‌ ఉన్నారు.

తిమ్మాపూర్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం సాయత్రం కరీంనగర్‌ పరిధిలోని అలుగునూర్‌కి చేరుకుంది. అలుగునూర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, మానకొండూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు, మహిళలు అధికసంఖ్యలో పొన్నం ప్రభాకర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలను పెంచడంతో పాటు చేసిందేమీ లేదన్నారు.

Updated Date - 2022-08-15T04:56:29+05:30 IST