ప్రగతిభవన్‌కే కేసీఆర్‌ పరిమితం

ABN , First Publish Date - 2022-05-27T05:20:40+05:30 IST

ప్రగతిభవన్‌కే కేసీఆర్‌ పరిమితం

ప్రగతిభవన్‌కే కేసీఆర్‌ పరిమితం
పెద్దతూప్ర రచ్చబండలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

  • ప్రజల కష్టాలు పట్టని ముఖ్యమంత్రి
  • జిల్లా కాంగ్రెస్‌ నాయకుల ధ్వజం

కడ్తాల్‌, మే 26: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు హామీలను విస్మరించి నియంత పా లనతో ప్రజలను ఇబ్బందులు పాల్జేస్తున్నాయని పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నెనావత్‌ బీక్యానాయక్‌ అన్నారు. ప్రగతి భవన్‌కు, ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజలను పట్టించుకో కుండా పారిశ్రామికవేత్తల కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. సాలార్‌పూర్‌లో గురువారం కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను అందజేశారు. ఉపాధి కూలీల సమ్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేడన్నారు. రైతుల కు ఉచిత విద్యుత్‌, ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేసి, గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథకాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. వేరే రాష్ట్రాల రైతులపై వాత్సల్యం చూపుతున్న సీఎం కేసీఆర్‌ సొంత రైతుల కష్టాలను పట్టించుకోవడంలేదన్నారు. టీఆర్‌ఎ్‌సకు ఆ రైతులే ఓటు వేశారా? అని ప్రశ్నించారు. లక్ష రుణ మాఫీ చేస్తామని నాలుగేళ్లయినా చేయలేదన్నారు. ప్రజల కష్టాలు కళ్ల ముందున్నా కేసీఆర్‌ పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమని, ప్రజల కష్టాలు తీరే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, బిచ్యానాయక్‌, శ్రీశైలం, జవహర్‌లాల్‌, బాల్‌రాజ్‌, కృష్ణనాయక్‌, మోహన్‌, ఇమ్రాన్‌బాబ, ఇక్బాల్‌ పాషా, శ్రీను రైతులు పాల్గొన్నారు.


  • పెద్దతూప్రలో రైతు డిక్లరేషన్‌పై వివరణ


శంషాబాద్‌: పెద్దతూప్రలో కాంగ్రెస్‌ నాయకులు రైతు డిక్లరేషన్‌పై వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చెప్పారు. బస్తీలు, పంట పొలాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రచ్చబండ నిర్వహించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పట్టింపులేని పాలనపై వివరించారు. కార్యక్రమంలో జ్ఞానేశ్వర్‌యాదవ్‌, శేఖర్‌, జె.నరేందర్‌, సంజయ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:20:40+05:30 IST