కేసీఆర్‌ అంటే.. ఖాసిం చంద్రశేఖర్‌ రజ్వీ

ABN , First Publish Date - 2022-08-17T08:19:32+05:30 IST

కేసీఆర్‌ అంటే ఖాసిం చంద్రశేఖర్‌ రజ్వీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

కేసీఆర్‌ అంటే.. ఖాసిం చంద్రశేఖర్‌ రజ్వీ

ఆయన కుమారుడు సయ్యద్‌ మక్బూల్‌ కేసీఆర్‌.. కరుకు బీడీలు ఏరుకుని తాగాడు బస్టాండ్‌లో మహిళ మెడలోని చైన్‌ కొట్టేశాడు దుబాయ్‌ పేరుతో యువతను ముంచాడు భార్యను కొడితే.. ఎంఎ్‌సఆర్‌కు చెప్పుకొంది పొద్దంతా తాగి.. రాత్రంతా పడుకుంటాడు ముఖ్యమంత్రివి లుచ్చా రాజకీయాలు నిరాహార దీక్ష పేరుతో మందు తాగాడు బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా..? ఈ పీకుడుగాళ్లు సీఎం, మంత్రులు అయ్యేవారా రాష్ట్రం రావద్దని కోరుకున్న మూర్ఖుడు కేసీఆర్‌ మందులో సోడా కలిపే సంతోశ్‌ ఏ త్యాగం చేశాడు మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఓటుకు 30 వేలిస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫైర్‌


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫైర్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కేసీఆర్‌ అంటే ఖాసిం చంద్రశేఖర్‌ రజ్వీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. కేటీఆర్‌కు ట్విటర్‌ టిల్లు అని పేరు పెడితే తనపై కేసు పెట్టారని, ఇప్పుడు సయ్యద్‌ మక్బూల్‌ అని రజాకార్ల వారసుడి పేరు పెడుతున్నానని అన్నారు. నిజాం కంటే ఎక్కువగా అరాచకాలు చేసిన విస్నూరుకు చెందిన బాబుదొర.. ఇక్కడ ఉన్నారని మంత్రి దయాకర్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 14వ రోజైన మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాలకుర్తిలో జరిగిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. పాలకుర్తికి చెందిన నల్లా నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పేదోళ్లు కాబట్టే వారి గురిం చి సీఎం కేసీఆర్‌, మంత్రి దయాకర్‌రావు మాట్లాడరని అన్నారు.


కేసీఆర్‌ కరుకు బీడీలు ఏరుకొని తాగాడని, దుబ్బాక బస్టాండ్‌లో లచ్చమ్మ అనే మహిళ మెడలోంచి చైన్‌ దొంగిలించాడని ఆరోపించారు. దుబాయ్‌ పేరుతో అమాయక యువకులను మోసం చేసిన వ్యక్తికి రాజ్యం అప్పగిస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ దొంగ అని, భర్త కొడుతున్నాడని కేసీఆర్‌ భార్య తన వద్దకు వచ్చి బతిమిలాడితే, కాపాడానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎంఎ్‌సఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. సీఎంకు తాగుడు తప్ప వేరే ధ్యాస లేదని.. పొద్దంతా తాగి, రాత్రంతా పడుకుంటాడని విమర్శించారు.  ముఖ్యమంత్రిపై యుద్ధాన్ని ప్రారంభించామని, ఎన్నికలు రాగానే మెడలు వంచి పాతర వేయడం ఖాయమని అన్నారు. ఆయన లుచ్చా రాజకీయాలు చేస్తూ, బీజేపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ దొంగ దీక్షలు చేశారని సంజయ్‌ విమర్శించారు. దీక్ష పేరుతో ఖమ్మం ఆస్పత్రిలో, ఢిల్లీలో మం దు తాగాడని, ఆ విషయాన్ని ఆధారాలతో బయటపెడతానని చెప్పారు.


‘‘బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా..? ఈ పీకుడుగాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యేవారా..?’’ అని నిలదీశారు. తెలంగాణ రావొద్దని కోరుకున్న మూర్ఖుడని కేసీఆర్‌పై మండిపడ్డారు. శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె హరీశ్‌రావుకు ఎందుకు దొరకలేదని ప్రశ్నించారు. మందులో సోడా కలిపే సంతోశ్‌ రావు ఏం త్యాగం చేశాడని ప్రశ్నించారు.  టీఆర్‌ఎస్‌, ఎంఐఎం రెండూ ఒకటేనని, ఒవైసీని చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జీ తాలు ఇవ్వకుండా చిప్ప చేతికిచ్చాడని, ఒక్కొక్కరిపై రూ.లక్షా 20 వేల అప్పు పెట్టాడని మండిపడ్డారు. సెప్టెంబరు 17న  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపి తీరాల్సిందేనని, లేదంటే మెడలు వంచి అధికారికంగా జరిపిస్తామని అన్నారు. వరంగల్‌ సీపీ తరుణ్‌జోషిపై సం జయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర పాలకుర్తిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో దుకాణాలను బలవంతంగా మూ యించి కర్ఫ్యూ విధించారని అ న్నారు. ‘టీఆర్‌ఎస్‌ పాలన ఇంకా ఆరు నెలలే.. తర్వాత నీ సంగతి చూస్తా బిడ్డా’ అని హెచ్చరించారు. సీపీకి మగతనం, దమ్ము ఉంటే తమపై రాళ్లు వేసిన వారి ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ మాట్లాడినవన్నీ అబద్ధాలని సంజయ్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లాకు సాగు, తాగు నీటి సౌకర్యం లేకుండా చేసింది ముమ్మాటి కీ ముఖ్యమంత్రేనని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా 10శాతం కూడా ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక వచ్చినందునే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటికి వచ్చారని చెప్పారు.


కేసీఆర్‌ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌ కార్యక్రమాలేనని విమర్శించారు. రూ.1.3 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందని, మిషన్‌ భగీరథకు రూ.40 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టినా, అనేక గ్రామాలకు నీళ్లు రావ డం లేదని చెప్పారు. రైతులకు ఉచిత కరెంట్‌ పేరిట టీఆర్‌ఎస్‌ నేతల ఫాంహౌ్‌సలకు ఉచిత విద్యుత్‌ కట్టబెట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


బెంగాల్‌ తరహా విధ్వంసం: తరుణ్‌ ఛుగ్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బెంగాల్‌ తరహా విధ్వంసాలకు పాల్పడుతోందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ అన్నారు. బండి సంజయ్‌ యాత్రపై టీఆర్‌ఎస్‌ దాడిని ఖండించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్‌ వణికిపోతున్నారని, అందుకే టీఆర్‌ఎస్‌ గూండాల ద్వారా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 


మళ్లీ.. ‘సాలు దొర.. సెలవు దొర’

సాలు దొర.. సెలవు దొర పేరుతో బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో మళ్లీ డిజిటల్‌ బోర్డు ఏర్పాటు చేశారు.  గతంలో ప్రహరీ గోడపై ఏర్పాటు చేయగా జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తొలగించారు. తాజాగా కార్యాలయ ఆవరణలో  ఏర్పాటు చేశారు.


రాష్ట్ర కార్యాలయం వద్ద బాంబు కలకలం

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కారులో బాంబు ఉందని సమాచారం రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గత మూడు రోజులుగా కార్యాల యం ఎదురుగా ఓ నానో కారు పార్క్‌ చేసి ఉంది. అందులో ఉన్న బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారు డోర్లను తెరిచి బాంబ్‌ స్క్వ్యాడ్‌, డాగ్‌ స్క్వ్యాడ్‌తో తనిఖీ చేసి, అందులో ఏమీ లేదని తేల్చా రు. కార్యాలయ సమీపంలో ఉండే ఫయాజ్‌ ఇంటి వద్ద పార్కింగ్‌ స్థలం లేక కారును అక్కడ పార్క్‌ చేశాడని తెలిపారు.

Updated Date - 2022-08-17T08:19:32+05:30 IST