కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్, కవిత ట్వీట్

ABN , First Publish Date - 2021-04-20T02:56:22+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకిన నేపథ్యంలో ఆయన కుమారుడు కె. తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత ట్వీట్లు చేశారు.

కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్, కవిత ట్వీట్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకిన నేపథ్యంలో ఆయన కుమారుడు కె. తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత ట్వీట్లు చేశారు. సీఎం కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని కవిత చెప్పారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


మంత్రి తారకరామారావు కూడా ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలున్నాయని తెలిపారు. అందరి ప్రార్ధనలతో కేసీఆర్ త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-04-20T02:56:22+05:30 IST