‘కేంద్ర ప్రభుత్వ సొమ్ములతో కేసీఆర్‌ సోకులు’

ABN , First Publish Date - 2022-09-28T03:48:54+05:30 IST

కేంద్ర ప్రభు త్వం సొమ్ముతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తామే ఇచ్చిన ట్లుగా ప్రచారం చేసుకుంటూ కేంద్రంపై విమర్శలు చేయడం సరి కాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రజా గోస- బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు. బైక్‌ ర్యాలీతో హమాలివాడ చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడా రు.

‘కేంద్ర ప్రభుత్వ సొమ్ములతో కేసీఆర్‌ సోకులు’
హమాలివాడలో మాట్లాడుతున్న లక్ష్మణ్‌

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌  

మంచిర్యాలలో ప్రజా గోస- బీజేపీ భరోసా యాత్ర 

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 27: కేంద్ర ప్రభు త్వం సొమ్ముతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తామే ఇచ్చిన ట్లుగా ప్రచారం చేసుకుంటూ కేంద్రంపై విమర్శలు చేయడం సరి కాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొ న్నారు. మంగళవారం  జిల్లా  కేంద్రంలో ప్రజా గోస- బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు.  బైక్‌ ర్యాలీతో   హమాలివాడ చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడా రు. కాలేజీ రోడ్‌, రాంనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌ ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఐబీ చౌరస్తాలో కార్యక ర్తలు గజమాల వేసి స్వాగతం పలికారు. ఎఫ్‌సీఐ ఫం క్షన్‌ హాల్‌, హమాలివాడ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీ ణ ఆవాస యోజన, కల్యాణలక్ష్మి లాంటి పథకాల్లో కేంద్రం వాటా చెల్లిస్తున్నప్పటికీ కేసీఆర్‌ తామే చేస్తు న్నామని ప్రజలను మోసగిస్తూ మోసగిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్‌ కుటుంబం మాత్ర మే బంగారుమయం చేసుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబి గా మార్చారన్నారు. బిల్లులు రాక సర్పంచ్‌లు,  ప్రభు త్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తీరు చూస్తే హృదయం తరించిపోతుం దన్నారు. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తా మని హామీలిచ్చి ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేక పోయిన చేతగాని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అన్నారు. మంచిర్యాలలో ఎన్‌టీఆర్‌నగర్‌, రాంనగర్‌లో వరద బాధితులు ఇండ్లు లేక వీధిన పడ్డారని, కనీసం వారికి నీడనిచ్చే పరిస్ధితి  లేదని, మొక్కుబడిగా వారిని పరా మర్శించి ముఖం చాటేశారన్నారు. జిల్లాలో పది  మం దికైనా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వాటి మూలాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుందని, ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయిందన్నారు. బీజేపీ దెబ్బతోనే  సమైఖ్యత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం, కొండా లక్ష్మణ్‌ బాపూజీ లాంటి మహనీయులు జీవిం చి ఉన్నప్పుడు వారిని పట్టించుకోలేదని, ఇప్పుడేమో జయంతి వేడుకలు నిర్వహించడం విడ్డూరంగా ఉంద న్నారు. హుజురాబాద్‌ ఎన్నికల కోసమే  కేసీఆర్‌ దళిత బంధును తెరపైకి తెచ్చారని, మునుగోడు ఎన్నిక ప్రభావంతో గిరిజన బంధు పేరిట ప్రజలను మోసగిం చేందుకు సిద్ధమయ్యారన్నారు. ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చి నిజమైన ఉద్యమకారులను జైళ్లపాలు చేశారన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో అందరికి పద వులు ఇచ్చారని, మనవడికి వయసు లేదని ఆగాడని, లేదంటే అతనికి ఇచ్చేవాడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావడం ఖాయం 

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనతో ప్రజలు విసుగుచెందారని, రాష్ట్రంలో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. హైటెక్‌ సిటీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తమ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడు తున్నారని, రాష్ట్రంలో పీడిస్తున్న చీడను తొలగించేం దుకు అందరూ భాగస్వాములు అవుతున్నారన్నారు.  సింగరేణి ప్రాంతంలో ఒకనాడు కార్మికులు  75 వేలు ఉండగా ప్రస్తుతం 30 వేలు ఉండడం కేసీఆర్‌ దయే నన్నారు. సింగరేణి నుంచి రూ.20 వేల కోట్లు తరలిం చి సింగరేణి ఖజానాను కొల్లగొట్టారన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ పార్టీలంటూ డ్రామాలు చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ, డ బుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మూడెకరాల భూమి ఇవ్వడంలో  ప్రభుత్వం  విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.80 వేల కోట్ల అవినీతికి కేసీఆర్‌ పాల్పడ్డారన్నారు. బీజేపీ జిల్లా  అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, నాయకులు వెంకటేశ్వర్‌రావు, రజినిష్‌జైన్‌, గోనె శ్యాసుందర్‌రావు, రవిందర్‌రావు, పట్టి వెంకటకృష్ణ, అందుగుల శ్రీనివాస్‌, మల్లారెడ్డి, రంగారావు, కర్ణ శ్రీధర్‌, తిరుపతి, రమేష్‌, మల్లేష్‌, శ్రీదేవి, మహేష్‌ పాల్గొన్నారు.  

నస్పూర్‌: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా గోస-బీజేపీ భరోసా మోటార్‌ సైకిల్‌ ర్యాలీని సీసీసీ కార్నర్‌ వద్ద  రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్‌ ప్రారంభిం చారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకున్న ఆయనకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. సీసీసీ కార్నర్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి మోటార్‌ సైకిల్‌ ర్యాలీ ప్రారంభించి మంచిర్యాలకు చేరింది. పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ అగల్డ్యూటి రాజు, నాయకులు ముల్కల్ల మల్లారెడ్డి, శ్రీదేవి, వెంకటకృష్ణ, రామకృష్ణ, సదానందం, సత్రం రమేష్‌, శ్రీనివాస్‌, మహేష్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T03:48:54+05:30 IST