రూ.10వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే

ABN , First Publish Date - 2021-01-19T06:25:08+05:30 IST

రైతుల అభ్యున్నతిని కాంక్షిస్తూ రూ.10వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చేతివృత్తుల ఆర్థిక పరిపుష్టికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు.

రూ.10వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమేష్‌గౌడ్‌ను అభినందిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌

ప్రధాని మోదీపై ధ్వజమెత్తిన మంత్రి జగదీష్‌రెడ్డి 

 భువనగిరి రూరల్‌, జనవరి 18:  రైతుల అభ్యున్నతిని కాంక్షిస్తూ రూ.10వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.  సోమవారం భువనగిరి శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో భువనగిరి మార్కెట్‌ కమిటీ  పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేసి రైతులకు నష్టం చేస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు నోరు మొదపడం లేదని ప్రశ్నించారు. రైతులు కన్నెర్ర చేస్తే కమలం పార్టీ కనిపించకుండా పోతుందని అన్నారు. జై శ్రీరామ్‌ నినాదం ముఖ్యం కాదని... ప్రజలకు అన్నంపెట్టే జై కిసాన్‌ నినాదాన్ని స్మరించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నూతన  మార్కెట్‌ పాలకవర్గం రైతుల సంక్షేమానికి పాటు పడాలని చెడ్డపేరు తీసుకురాకుండా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, గ్రంథాలయ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రైతు బంధు  జిల్లా కోఆర్డినేటర్‌ కొలుపుల అమరేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్లు నల్లమాస రమేష్‌గౌడ్‌, అల్వ మోహన్‌రెడ్డి, స్థానిక పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌  వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, డీసీసీబి డైరెక్టర్‌ అందెల లింగం యాదవ్‌, ఇన్‌చార్జీ ఆర్డీవో విజయకుమారి, డీఎం అలీం, ఏడీఏ దేవ్‌సింగ్‌, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, శెట్టి బాలయ్య, సీహెచ్‌ రాజేశ్వర్‌రావు, జనగాం పాండు పాల్గొన్నారు. కాగా భువనగిరి మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గాన్ని డీఎం అలీం ప్రమాణ స్వీకారం చేయించారు.  

Updated Date - 2021-01-19T06:25:08+05:30 IST