రైతుల సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-31T07:07:29+05:30 IST

రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమాభివృధ్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని సాంఘీక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు

రైతుల సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం

సాంఘీక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌


మెట్‌పల్లి రూరల్‌, అక్టోబర్‌ 30 : రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమాభివృధ్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని సాంఘీక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతలతో కలిసి ప్రారంభించారు. అదే విధంగా మండలంలోని విట్టంపేట, మెట్లచిట్టాపూర్‌ గ్రామాల్లో పీఎస్‌సీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. విట్టంపేట రైతులు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని విన్నవించగా స్పందించిన మంత్రి కొనుగోలు కేంద్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మెట్లచిట్టాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేధిక భవనాన్ని మంత్రి పరిశీలించి సౌకర్యాలు చూసి సర్పంచ్‌ బద్దం శేఖర్‌రెడ్డిని అభినందించారు. రైతులు పండిస్తున్న సన్నరకం వరికి మద్దతు ధర రూ.2500 కేటాయించాలని సర్పంచ్‌ కోరగా రైతుల సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కోనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం, ఏఎంసీ చైర్మన్‌ జరుపుల భారతి, వైస్‌చైర్మన్‌ సుధాకర్‌గౌడ్‌, విశాల సహాకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి, ఎంపీపీ మారుసాయిరెడ్డి, జెడ్పీటీసీ కాటిపెల్లి రాధ-శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాణవేని సుజాత, సర్పంచులు బద్దం శేఖర్‌రెడ్డి, ఆకుల రాజరెడ్డి, పీఎస్‌సీఎస్‌ చైర్మన్లు నవీన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, ఎంపీడీవో కల్పన, తహసీల్దార్‌ రాజేశ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:07:29+05:30 IST