కేసీఆర్‌ రైతు పక్షపాతి : వంటేరు ప్రతా్‌పరెడ్డి

ABN , First Publish Date - 2021-08-03T04:30:34+05:30 IST

కేసీఆర్‌ రైతు పక్షపాతి అని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

కేసీఆర్‌ రైతు పక్షపాతి : వంటేరు ప్రతా్‌పరెడ్డి
విలేకరులతో మాట్లాడుతున్న వంటేరు

గజ్వేల్‌/తొగుట, ఆగస్టు 2 : కేసీఆర్‌ రైతు పక్షపాతి అని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మలిదశ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొదటిదశలో రూ.25 వేలలోపు ఉన్న రుణాలను మాఫీ చేశారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మలిదశగా రూ.50 వేలలోపు రుణాన్ని మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే 57 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి పింఛన్లు ఇస్తామని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా 6 లక్షల 62 వేల మందికి పింఛన్‌ అందుతుందన్నారు. దళితులకు దళితబంధు ద్వారా రూ.10 లక్షల సాయం అందించడంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండి వారు ఆర్థికంగా బలపడతారన్నారు. ఆయన వెంట గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని తొగుట జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండోదఫా రుణమాఫీలో భాగంగా రూ.50 వేల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసేందుకు కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం సంతోషమన్నారు. దాంతోపాటు 57 ఏళ్లు నిండిన వారందరీకి వృద్ధాప్య పెన్షన్‌ మంజూరు, ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు పొడిగింపు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-03T04:30:34+05:30 IST