కేసీఆర్‌కు జనం కష్టాలు పట్టవు‌: విజయశాంతి

ABN , First Publish Date - 2022-07-24T02:01:40+05:30 IST

Hyderabad: సీఎం కేసీఆర్ (KCR), టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్

కేసీఆర్‌కు జనం కష్టాలు పట్టవు‌: విజయశాంతి

Hyderabad: సీఎం కేసీఆర్ (KCR), టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు కష్టాలు పట్టడం లేదన్నారు. వారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా..ప్రభుత్వం మొద్దునిద్రపోతోందని సోషల్ మీడియాలో విమర్శించారు. విజయశాంతి పోస్టు యథాతథంగా..

 

‘‘హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరదనీరే... రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా... ప్రజలు కొన్నిచోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తనని చెప్పిన ముఖ్యమంత్రి సారూ... మీరు చెప్పిన డల్లాస్ అంటే ఇదేనా? హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంటే... మీరు మాత్రం ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? కనీసం మంత్రులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ వరద ప్రాంతాల్లో పర్యటించకుండా తప్పించుకుని తిరుగుతున్నరు. ఇంకా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ ప్రభుత్వం  ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక మొన్నటి వరకు భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయితే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం భద్రాచలంలోనే నష్టం జరిగినట్టు చూపిస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం భాగ్యనగరంలో కూడా అలాంటి ప్రయత్నమే చేస్తోంది. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నరు. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు.’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-24T02:01:40+05:30 IST