Telangana CM: కేసీఆర్ బాటలో షిండే, ఫడ్నవీస్

ABN , First Publish Date - 2022-08-17T03:42:36+05:30 IST

ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాటలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుస్తున్నారు.

Telangana CM: కేసీఆర్ బాటలో షిండే, ఫడ్నవీస్

ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాటలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుస్తున్నారు. మిగతా అంశాల్లో ఎలా ఉన్నా జాతీయ గీతాన్ని రాష్ట్ర ప్రజలతో పాడించే విషయంలో మాత్రం మహారాష్ట్ర సర్కారు ముమ్మాటికీ కేసీఆర్‌ను ఫాలో అయింది. తెలంగాణలో ఈ ఉదయం పదకొండున్నరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన చేశారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు జాతీయగీతాలాపనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆబిడ్స్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయగీతం పాడగా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు, అధికారులు ఆయన్ను అనుసరించారు. ఎంఐఎం అధినేత ఒవైసీ కూడా జాతీయగీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 


కేసీఆర్ ఆలోచన సూపర్ హిట్ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఆచరణలో పెట్టింది. మహారాష్ట్రలో ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 11గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయగీతాలాపన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. షిండే సర్కారు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 


రాజకీయపరంగా పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా జాతీయవాదం, దేశభక్తి విషయంలో అంతా ఒక్కటౌతారనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఒక్క మహారాష్ట్రలోనే కాదు ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయగీతాలాపన చేయిస్తే మరింత బాగుంటుందని సలహాఇస్తున్నారు. 



Updated Date - 2022-08-17T03:42:36+05:30 IST