ఆలస్యమైనా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషం: కేసీఆర్

ABN , First Publish Date - 2021-12-04T16:57:30+05:30 IST

హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ రమణకు ధన్యవాదాలు తెలిపారు.

ఆలస్యమైనా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషం: కేసీఆర్

హైదరాబాద్: హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ రమణకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆలస్యమైనా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషమన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతమన్నారు.


 ఏఐఎంసీ కోసం 25వేల చదరపు అడుగులు కేటాయించామన్నారు. 


శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమి కేటాయిస్తామని కేసీఆర్ వెల్లడించారు.

Updated Date - 2021-12-04T16:57:30+05:30 IST