ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-03-30T02:50:23+05:30 IST

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు: కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. ఐదారు రోజుల్లో రైతులకు కూపన్లు పంపిణీ చేస్తామని, తెలంగాణలో 40 లక్షల ఎకరాల్లో వరి పండుతోందని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదని కేసీఆర్‌ తెలిపారు. పౌరసరఫరాల శాఖకు రూ.25 వేల కోట్లు సమకూర్చామన్నారు. గ్రామాల సరిహద్దుల్లోని కంచెలను తొలగించాలని కేసీఆర్‌ అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించాలని, సి విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని కేసీఆర్‌ చెప్పారు. మన దగ్గర పండే పండ్లను ఇతర రాష్ట్రాలకు పంపొద్దని, హైదరాబాద్‌లో 500 కేంద్రాల్లో పండ్ల విక్రయం జరుగుతుందన్నారు. రైస్‌ మిల్లర్లను గ్రామాల్లోకి రానివ్వాలని, రైస్‌ మిల్లర్లు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం రైస్‌ మిల్లర్లతో సమావేశమవుతున్నామని కేసీఆర్‌ వెల్లడించారు.

Updated Date - 2020-03-30T02:50:23+05:30 IST